పల్నాడు జిల్లా దాచేపల్లిలో డయేరియా పరిస్థితిపై నిరంతరం సమీక్షిస్తున్నారు మంత్రి నారాయణ.. పల్నాడు జిల్లా కలెక్టర్ తో పాటు ఇతర అధికారులతో మాట్లాడారు మంత్రి.. అయితే, ప్రస్తుతం దాచేపల్లిలో డయేరియా అదుపులోనే ఉందని కలెక్టర్ వివరించారు.. కొత్తగా ఎలాంటి కేసులు నమోదు కాలేదని వెల్లడించారు.. ఇక, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆరుగురి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యాధికారులు తెలియజేశారు..
పల్నాడు జిల్లా దాచేపల్లిలో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. టీడీపీ కార్యకర్త కనిశెట్టి నాగులు ఇంటిపై వైసీపీ వర్గీయులు మారణాయుధాలతో దాడి చేశారు. దీంతో నాగులు ఇంటి సభ్యులు ప్రాణభయంతో ఇంట్లోకి వెళ్లి తాళాలు వేసుకున్నారు. ఈ దాడి ఘటనపై పోలీసులు సమాచారం అందుకుని టీడీపీ కార్యకర్త ఇంటికి చేరుకోవడంతో వైసీపీ వర్గీయులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు వేయలేదనే కక్ష్యతోనే వైసీపీకి చెందిన మున్సిపల్ ఛైర్‌పర్సన్ మునగ రమాదేవి భర్త, కుమారులు ఈ దాడికి…