నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ఈరోజు తుఫానుగా మారే అవకాశం ఉందని, ఆ తర్వాత రెండు రోజుల్లో శ్రీలంక తీరాన్ని దాటుకుని తమిళనాడు వైపు వెళ్లే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుఫాన్‌కు'ఫెంగల్'గా నామకరణం చేశారు.
Cyclone Fengal: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈరోజు (బుధవారం) తుఫానుగా మారుతుంది. దీంతో తమిళనాడు, పుదుచ్చరిలకు భారత వాతవావరణ శాఖ రెడ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది.