Andhra Pradesh: ఏపీలో మాండూస్ తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా పలు జిల్లాలలో అధికారులు కంట్రోల్ రూంలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు అన్నమయ్య జిల్లాలో మాండూస్ తుఫాన్ కారణంగా ఈరోజు, రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ గిరీషా సూచించారు. జిల్లాలో సైక్లోన్ కమాండ్ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామని.. ఎక్కడైనా సమస్యలు ఎదురైతే సమస్యలపై కంట్రోల్ రూం నంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు. అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ కమాండ్ కంట్రోల్ రూమ్:…
బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం తీరం వైపు దూసుకొస్తుంది.. దక్షిణ అండమాన్‌లో ఉన్న అల్పపీడనం పశ్చిమ వాయువ్యంగా పయనించి నిన్న ఉదయానికి తీవ్ర అల్పపీడనంగా, సాయంత్రానికి వాయుగుండంగా మారిపోయింది.. ఇవాళ సాయంత్రానికి తుఫాన్‌గా మారుతుందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.. పశ్చిమ వాయువ్యంగా పయనిస్తూ నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశించి రేపు ఉదయం ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాల్లో తీరం దిశగా రాబోతోంది.. ఆ తర్వాత పశ్చిమ వాయువ్యంగానే పయనిస్తూ ఈనెల 9వ తేదీ రాత్రి లేదా 10న…
అసని తుఫాన్ ప్రభావంతో హైదరాబాద్‌లో వాన కురుస్తుంది. నగర వ్యాప్తంగా ఉదయం 4.30 గంటల నుంచి చిరుజల్లులు పడుతున్నాయి. తుఫాన్ ప్రభావంతో ఆకాశం మొత్తం మబ్బులు కమ్ముకున్నాయి. దీంతో వాతావరణం చల్లబడటంతో నగరవాసులకు ఉక్కబోత నుంచి ఉపశమనం లభినట్లయింది. బుధవారం తెల్లవారుజాము నుంచే హయత్‌నగర్, వనస్థలిపురం, ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, కోఠి, నాంపల్లి, లక్డీకపూర్, ఖైరతాబాద్, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట్, ఉప్పల్, సికింద్రాబాద్‌లో వానకురుస్తున్నది. కాగా, నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో చిరు జల్లులు పడుతున్నాయి. అసని తుఫాను…
అమ్మబోతే అడవి… కొనబోతే కొరివి అన్నట్టుగా తయారైంది కొబ్బరి రైతుల దుస్థితి. కన్నకొడుకు ఆదుకున్న లేకపోయినా కొబ్బరి చెట్టు ఆదుకొంటుందని కోనసీమ వాసుల నమ్మకం. కొబ్బరి చెట్టును కల్పతరువుగా పూజిస్తారు కోనసీమ వాసులు . కొబ్బరి ఉత్పత్తుల పేరు చెబితే గుర్తొచ్చేది కేరళ తరువాత కోనసీమ కొబ్బరి మాత్రమే. గత కొన్ని ఏళ్లుగా కోనసీమ కొబ్బరి రైతులు దిగుబడి లేక నల్లి తెగుళ్ల వల్ల ఉత్పత్తి తగ్గిపోయి ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొంటున్నారు. వాతావరణంలో మార్పుల వలన…
ఒడిషా, బెంగాల్ రాష్ట్రాలకు యాస్ తుఫాన్ అతి తీవ్ర ముప్పు ఉన్నట్లు తెలుస్తుంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్ గా మారిన యాస్… వచ్చే 12గంటల్లో మరింత బలపడి విరుచుకుపడే అవకాశం ఉంది. పారాదీప్ కు దక్షిణ-ఆగ్నేయంలో 320 కి.మీ.., బాలాసోర్ కి ఆగ్నేయంగా 430 కి.మీ దూరంలో కేంద్రీకృతం అయ్యి చాంద్ బలి దగ్గర రేపు అతితీవ్ర తుఫాన్ తీరం దాటే చాన్స్ ఉన్నట్లు సమాచారం. ఐఎండీ ఆరెంజ్ బులెటిన్ విడుదల చేయగా… యాస్…