తీరం వైపు దానా తుఫాన్ దూసుకొస్తుంది.. తూర్పుమధ్య బంగాళాఖాతంలో కొనసాగుతోన్న ‘దానా’ తుఫాన్.. రేపటికి వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌గా రూపాంతరం చెందుతుందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.. ఇక, గడిచిన 6 గంటల్లో గంటకు 15 కిలో మీటర్ల వేగంతో కదులుతున్న తుఫాన్.. గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము లోపు తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది..