అరేబియా సముద్రంలో ఏర్పడిన అస్నా తుఫాన్ దూసుకొస్తోంది. గంటకు 13-15 కిమీ వేగంతో పశ్చిమ దిశగా అస్నా దూసుకొస్తున్నట్లు కేంద్ర వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర వాయువ్య దిశగా క్రమంగా కదులుతోందని పేర్కొన్నారు.
Cyclone Asna: అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం ఉదయం తుఫాన్ గా మారింది.. దీంతో గత కొన్ని రోజులుగా గుజరాత్ రాష్ట్రంలో కుండపోత వర్షాలకు కారణమైంది అని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది.