ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం రాజస్థాన్‌లోని బికనీర్ జిల్లాలో పర్యటించారు. అందులో భాగంగా రూ.24,300 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అంతకుముందు ప్రధాని మోదీ రోడ్‌షోలో పాల్గొన్నారు. ఈ రోడ్ షోలో ప్రధానికి వినూత్నంగా సైకిలిస్టులు స్వాగతం పలికారు. ఆ సమయంలో ప్రధానమంత్రి కారుతో పాటు సైకిల్ తొక్కుతూ కనిపించారు. ప్రధానమంత్రి రోడ్‌షో సందర్భంగా ఆయనను చూసేందుకు ప్రజలు రోడ్డు పక్కనే నిల్చున్నారు.