అతిపెద్ద సైబర్ నేరగాళ్ల ముఠాను పట్టుకుంది తెలంగాణ సైబర్ సెక్యురిటీ బ్యూరో…!! దేశవ్యాప్తంగా 450 కిపైగా కేసుల్లో ప్రమేయం ఉన్న 25 మంది సైబర్ క్రిమినల్స్ ఆటకట్టించారు. ఒక్క తెలంగాణలోనే 60కి పైగా సైబర్ నేరాలకు పాల్పడింది ఈ ముఠా. 7 రాష్ట్రాలకు చెందిన సైబర్ నేరగాళ్లను పట్టుకున్న పోలీసులు.. 72 లక్షల రూపాయలకుపైగా స్వాధీనం చేసుకున్నారు. ఒక్క జూన్‌లోనే సైబర్ నేరాల బారిన పడిన బాధితులకు 3 కోట్ల 67 లక్షల రూపాయలను తిరిగి ఇప్పించారు…