ఐ బొమ్మ కేసులో కీలక ఇమ్మడి రవిపై కస్టడీ విచారణ ఐదో రోజుకు చేరుకుంది. నేటితో ఆయన కస్టడీ గడువు ముగియనున్న నేపథ్యంలో, గత నాలుగు రోజులుగా సైబర్ క్రైమ్ పోలీసులు రవిని ప్రశ్నిస్తున్నారు. అయితే విచారణ మొత్తం ఐబొమ్మ రవి పొంతన లేని సమాధానాలు ఇస్తూ, పోలీసులను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాడని అధికారులు తెలిపారు. యూకే, కరేబియన్ దీవుల్లో పనిచేస్తున్న సిబ్బంది, విదేశాల్లో ఉన్న సర్వర్ల వివరాలపై ఆధారాలు చూపిస్తూ ప్రశ్నించినప్పటికీ, ఇమ్మడి రవి…