ఉద్యోగాల కోసమని వెళ్లి థాయ్‌లాండ్ కేంద్రంగా సైబర్ ఫ్రాడ్ కేఫ్ లో బందీలుగా మారి బలవంతంగా సైబర్ వెట్టిచాకిరికి గురవుతున్న వందలాది మంది భారతీయ యువతకు విముక్తి లభించింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ జోక్యంతో వీరందరినీ స్వదేశానికి రప్పించే ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. మొత్తం 540 మంది బందీలను గుర్తించగా వీరిలో తెలంగాణ, ఏపీకి చెందిన 42 మందిని గుర్తించారు. వీరందరినీ 270 మంది చొప్పున రెండు విమానాల్లో తరలించేందుకు ఏర్పాట్లు…