500 Rupee Note Holders: చాలా సార్లు ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేస్తున్నప్పుడు చిరిగిపోయిన లేదా పాత నోట్లు వస్తుంటాయి. అప్పుడు వినియోగదారులు ఆందోళనకు గురవుతున్నారు.
దేశంలో కరెన్సీ నోట్లపై జాతిపిత గాంధీజీ బొమ్మ కనిపిస్తుంది. బోసి నవ్వులు నవ్వుతూ ఉండే ఆ బొమ్మ లేకుంటే ఆ నోటు చెల్లదు. దేశంలో స్వాతంత్య్రం రాకముందు నుంచే కరెన్సీ నోట్లు అందుబాటులో ఉన్నాయి. స్వాతంత్య్రం రాక ముందు ఉన్న కరెన్సీ నోట్లపై కింగ్ జార్జ్ బొమ్మ ఉండేది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1949తో ఇండియా రూపాయి నోటును అందుబాటులోకి తీసుకొచ్చింది. రూపాయినోటుపై కింగ్ జార్జ్ బొమ్మకు బదులుగా మహాత్మా గాంధీ బొమ్మను ఉంచాలని ఆర్‌బీఐ…