సంచలనం సృష్టించిన క్రూజ్ నౌక డ్రగ్స్ కేసులో క్లీన్ చిట్ పొందిన బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ గురించి ఎన్సీబీ తాజాగా సంచలన విషయాలు బయటపెట్టింది. అమెరికాలో తాను గ్రాడ్యుయేషన్ చదువుతున్నప్పటి నుంచే గంజాయి తాగడం మొదలుపెట్టినట్టు స్వయంగా ఆర్యన్ అంగీకరించినట్టు ఎన్సీబీ తెలిపింది. ఆ సమయంలో తాను నిద్ర సంబంధిత సమస్యలతో బాధపడేవాడినని, గంజాయితో ఆ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని ఇంటర్నెట్‌లో చూసిన తర్వాతే తాను దాన్ని తీసుకోవడం ప్రారంభించానని…