తమిళనాడులో నటుడు-రాజకీయ నాయకుడు విజయ్.. కరూర్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జరిగిన తొక్కిసలాట విషాదాంతంగా మిగిలిన సంగతి తెలిసిందే. అయితే కరూర్ తొక్కిసలాట ఘటనపై కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరూర్ తొక్కిసలాట ఘటనలో ఎంతో మంది ప్రాణాలు కొల్పోవడం, గాయపడడం తనను ఎంతగానో కలిచి వేసిందని అన్నారు. అటువంటి సంఘటనలకు దారితీసిన విస్తృత సామాజిక సమస్యలపై ప్రస్తావించారు. అభిమానులు, మీడియాతో సహా అన్ని వర్గాల నుండి ఆత్మపరిశీలన చేసుకోవాలని పిలుపునిచ్చారు.…