అదిగో పులి అంటే ఇదిగో తోక అన్న చందాన, నిన్న మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన ఒక వార్తను ఎవరో ఒకరు తప్పుగా రాయడం మొదలుపెట్టడంతో, సోషల్ మీడియా అంతా అదే హడావుడితో నిండిపోయింది. అసలు విషయం ఏమిటంటే, ముఖ్యమంత్రి సహాయనిధికి మెగాస్టార్ చిరంజీవి కోటి రూపాయలు విరాళం ఇచ్చారని చెబుతూ, ఒక సోషల్ మీడియా అకౌంట్ నుంచి తొలుత ఒక ట్వీట్ పడింది. వెంటనే దాన్ని బేస్ చేసుకుని, సోషల్ మీడియాలో వేరే అకౌంట్ల నుంచి ట్వీట్లు…