Maharashtra: ఆరుగాలం శ్రమించినా పంట దిగుబడి ఆశించిన స్థాయిలో రాకపోతే అన్నదాత కళ్లలో ఆనందం ఉండదు. కొన్నిసార్లు పురుగు మందుల నుంచి కూలీల వరకు ఖర్చు చేసినా డబ్బు వెళ్లని పరిస్థితులుంటాయి. అప్పులు తెచ్చి వాటిని తీర్చలేని పరిస్థితి నెలకొంటుంది. తాజాగా ఉల్లిగడ్డ సాగు చేసిన రైతుకు ఇదే పరిస్థితి నెలకొంది. అహోరాత్రులు కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోగా, కనీసం రవాణా ఖర్చులు కూడా మిగలని దయనీయ పరిస్థితి దాపురించింది. అసలు ఏం జరిగిందంటే..?
ఆరుగాలం కష్టపడి పండిస్తున్న రైతన్నకు నష్టాలే మిగులుతున్నా యి. ఓ వైపు ప్రభుత్వ నిర్లక్ష్యం.. మరోవైపు అకాల వర్షాలతో కన్నీళ్లే మిగులుతున్నాయి. దేశాన్ని ఎప్పుడూ ఆకలితో పడుకోనివ్వని రైతు ప్రకృతి ముందు కూడా నిస్సహాయుడవుతున్నాడు. చలి, వేడి, ఎండ, వానలను భరించి తాను పండించిన పంటను మార్కెట్‌కు తరలిస్తే అక్కడ కూడా పంటకు రక్షణ లేకుండా పోతోంది. అకాల వర్షాల వల్ల వారి పంటలు కొట్టుకుపోతే.. ఆ అన్నదాత ఎంత ఆవేదనకు గురవుతాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.…