రుణమాఫీపై పత్రికల్లో వచ్చిన వార్తలు, ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవాలు లేవని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున వైరాలో 2 లక్షల వరకు రుణమాఫీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని మంత్రి తెలిపారు.
చాలా మంది రైతులకు రుణమాఫీ జరగలేదంటూ బీజేపీ నాయకులు ఒక ప్రకటన విడుదల చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆరోపణ చేయడం నిజంగా విడ్డూరంగా ఉందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు
ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి రైతు రుణమాఫీ చేయలేదు అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆగస్ట్ 15వ తేదీ లోపు ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతాం అన్నారు. వచ్చే సారి పండించే వడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చి ప్రతి గింజ కొనుగోలు చేసే బాధ్యత నాదన్నారు.
తెలంగాణలో రైతుల రుణమాఫీ ప్రక్రియ ప్రారంభమైంది. రుణమాఫీ చెల్లింపులకు రూ.167.59 కోట్లు ఆర్థికశాఖ నుండి విడుదలయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన మాట ప్రకారం నేడు రూ.37 వేల నుండి రూ.41 వేల మధ్యన ఉన్న రుణాలు మాఫీ అయ్యాయి.
Farmers Loan: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతుల రుణమాఫీని పునఃప్రారంభించాలని నిర్ణయించారు. నేటి నుంచి రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని పునఃప్రారంభించాలని మంత్రి హరీశ్‌రావుతో పాటు కార్యదర్శి రామకృష్ణారావును సీఎం కేసీఆర్ ఆదేశించారు.
అన్నదాతలకు గుడ్‌న్యూస్ చెబుతూ.. రుణమాఫీ నిధుల విడుదల చేసిన ప్రభుత్వం… దశలవారీగా లబ్ధిదారులైన రైతుల ఖాతాల్లో ఆ సొమ్మును జమ చేస్తూ వస్తుంది.. రూ.25 వేల నుంచి రూ.50 వేల లోపు రుణాలున్న రైతులకు రుణమాఫీ నిధుల విడుదల కొనసాగుతుండగా.. ఇక, రెండో రోజులో భాగంగా 38,050 మంది రైతుల ఖాతాల్లోకి రుణమాఫీ నిధులను బదలాయించింది ప్రభుత్వం.. ఇవాళ ఒకేరోజు రుణమాఫీ కింద రూ.100.70 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయ్యాయి. కరోనా పరిస్థితులతో ఆర్థిక కష్టాలున్నా..…