Mulugu: నేడు ములుగు జిల్లాలో రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క పర్యటించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించి అధికారులు, పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. అయితే గత రాత్రి వాజేడు మండల కేంద్రంలో కురిసిన వర్షం వల్ల ముందుగా ఏర్పాటు చేసిన జూనియర్ కళాశాల ప్రాంగణం సభకు పనికి రాకుండా పోవడంతో, చెక్కుల పంపిణీ సభను ఐటీఐ కళాశాల వద్దకు మార్చారు. ఈ కార్యక్రమంలో గత సంవత్సరం మొక్కజొన్న పంటలో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెక్కులను…