ఇటీవల మీర్‌ఆలం ట్యాంక్‌లో మొసళ్లు, పాములు సంచరిస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆ మీర్ ఆలం ట్యాంకులో మొసలి ప్రత్యక్షమైంది. పాత బస్తీలోని మీర్ ఆలం ట్యాంక్ చుట్టూ ఉన్న నెక్లెస్ రోడ్డును తెరవడంలో జాప్యం చేయడంతో ఆ ప్రాంతం పాములు, తేళ్లు, మొసళ్లకు నిలయంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.