Floods In Spain: దక్షిణ, తూర్పు స్పెయిన్ మంగళవారం వినాశకరమైన వరదలను ఎదుర్కొంది. కొన్ని ప్రాంతాల్లో కేవలం కొన్ని గంటల్లో రికార్డు స్థాయిలో 12 అంగుళాల వర్షం కురిసింది. కుండపోత వర్షం విస్తృతమైన విధ్వంసానికి దారితీసింది. భారీ వర్షాల కారణంగా తూర్పు ప్రాంతంలో ఉన్న వాలెన్సియాలో వరదలు సంభవించాయి. భారీ వరదల కారణంగా రోడ్లపై పార్క్ చేసి ఉంచిన కార్లు, ఇతర వాహనాలు కొట్టుకుపోయాయి. పలు ప్రాంతాల్లో మురికి నీరు వీధుల్లోకి చేరింది. దీంతో ప్రజలు తీవ్ర…