డీజిల్ దొంగతనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన పెట్రోల్ పంప్ మేనేజర్ కాల్చి చంపబడిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో చోటుచేసుకుంది. లక్నో నుంచి ఢిల్లీకి వెళ్లే జాతీయ రహదారి-24పై ఆగి ఉన్న ట్రక్కు నుండి దొంగలు డీజిల్‌ను దొంగిలిస్తుండగా.. ఆపడానికి ప్రయత్నించిన పెట్రోల్ పంప్ మేనేజర్ ప్రయత్నించాడు. దీంతో తమ వద్ద ఉన్న గన్‌తో దొంగలు అతనిని పట్టపగలే కాల్చి చంపేశారు.
మధ్యప్రదేశ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్ భూతం పడగవిప్పింది. ఎంబీబీఎస్ సీనియర్ విద్యార్థుల బృందం జూనియర్లను అసభ్యకరంగా దుర్భాషలాడుతూ ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. ర్యాగింగ్‌కు పాల్పడిన సీనియర్ విద్యార్థుల వివరాలు వెల్లడి కాలేదు.
తమిళనాడు బాలికల ఆత్మహత్యలు ఆవేదన కలిగిస్తున్నాయి. తమిళనాడులో కడలూర్ జిల్లాలో మంగళవారం 12వ తరగతి చదువుతున్న మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. రాష్ట్రంలో రెండు వారాల్లోనే ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.
Unknown Dead Body Found At Langar House Musi: హైదరాబాద్ లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డిఫెన్స్ కాలనీ వెనుక భాగంలో మూసీలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. దీనిని గమనించిన స్థానికులు పోలీసులుకు సమాచారం అందించగా.. వెంటనే సంఘటనా స్థలానికి అధికారులు చేరుకున్నారు. పోస్టుమార్టం నిర్వహించాక ఉస్మానికా మార్చరీకి తరలించారు. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఎవరైనా చంపి మూసీలో ఈ శవాన్ని పడేశారా? లేక ఆత్మహత్య చేసుకున్నారా? లేక మూసీలో…
హైదరాబాద్ నార్నింగీలో కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపుతోంది. ఓ దుండగుడు ఒక చిన్నారి నోరు మూసి, ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశాడు. అయితే.. అటు వెళ్తున్న ఓ మహిళకు అనుమానం కలగడంతో అడ్డుకుంది. ఎందుకు చిన్నారి నోరు మూశావని గట్టిగా అరుస్తూ నిలదీసింది. దీంతో గాబరాపడ్డ ఆ కిడ్నాపర్.. మహిళని తోసేసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఇంతలోనే స్థానికులు అతడ్ని పట్టుకున్నారు. చెట్టుకు కట్టేసి చితకబాదారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. కిడ్నాపర్‌ను స్టేషన్‌కు…
దేశ రాజధానిలో మరో దారుణం జరిగింది. ఢిల్లీలోని రైల్వేస్టేషన్లో 30 ఏళ్ల మహిళపై నలుగురు కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. గురువారం రాత్రి జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.