Bihar Thief: రైలు, బస్సుల్లో వంటి రద్దీగా ఉండే ప్రదేశాల్లోనూ దొంగలు తమ చేతి వాటాన్ని చూపిస్తూనే ఉంటారు. ఎంత తెలివిగా తప్పించుకున్నా కొన్నిసార్లు దొంగ దొరికిపోతుంటాడు. తాజాగా ఓ దొంగ రైల్వే స్టేషన్ నుంచి కదులుతున్న రైలులో మొబైల్ ఫోన్ చోరీకి ప్రయత్నించి చివరికి ఊహించని విధంగా విఫలమయ్యాడు. కదులుతున్న రైలులో ఉన్న ప్రయాణికుల నుంచి మొబైల్ ఫోన్ చోరీ చేయాలనుకున్న దొంగకు భయంకరమైన అనుభవం ఎదురైంది. అప్రమత్తమైన ప్రయాణికులు అతడి చేయిని పట్టుకోవడంతో సుమారు…
ఇద్దరు యువతులు చెట్టుకు వేలాడుతూ కనిపించడం కలకలం సృష్టించింది. దళిత వర్గానికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లను కిడ్నాప్ చేసి ఆ తర్వాత వారిపై లైంగికంగా దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.
మహారాష్ట్రలోని నందుర్బార్ జిల్లాలో.. తమ కుమార్తెపై జరిగిన దారుణానికి న్యాయం జరగకపోతే ఆమె మృతదేహానికి అంత్యక్రియలు చేయబోమని ఓ కుటుంబం పట్టుబట్టి కూర్చొంది. దహన సంస్కారాలు జరపకుండా మృతదేహాన్ని ఉప్పుతో కప్పివేసి 45 రోజులుగా అలాగే ఉంచారు.
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నవీస్ ఫేస్బుక్ పేజీలో అసభ్యకరమైన వ్యాఖ్యలు పోస్ట్ చేసినందుకు 50 ఏళ్ల మహిళను సైబర్ పోలీసు విభాగం మంగళవారం అరెస్టు చేసింది.
కేరళలో కన్నూర్‌లోని చావస్సేరిలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) కార్యకర్త ఇంటి ముందు గురువారం రాత్రి బాంబు పేలింది. మట్టన్నూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్ఎస్ఎస్ కార్యకర్త సుధీష్ ఇంటికి 50 మీటర్ల దూరంలో బాంబు పేలింది.
పంజాబ్‌లో తన సీనియర్ తనను అవమానించాడని ఆరోపిస్తూ అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్ ఈ ఉదయం పోలీస్ స్టేషన్లో తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతను ఒక వీడియో కూడా రికార్డ్ చేశాడు.