Junk Food: జంక్ ఫుడ్ తినడం ఓ యువకుడి ఆత్మహత్యకు కారణమైంది. జంక్ ఫుడ్ తిన్నందుకు తండ్రి మందలించడంతో 19 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేస్తున్న భూమిక వినోద్ ధన్వానీ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ఈ రోజు వెల్లడించారు. నగరంలోని సింధీ కాలనీలో నివాసం ఉంటున్నట్లు తెలిపింది.
అన్నమయ్య జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోయారు. జిల్లా సరిహద్దుల్లో తనిఖీలు చేస్తున్న కానిస్టేబుల్‌ను వాహనంతో ఢీకొట్టి చంపారు. కర్ణాటక రిజిస్ట్రేషన్‌తో ఉన్న కారుతో ఢీకొట్టడంతో ఒక కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు సోమవారం రాత్రి తనిఖీలు చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.