కర్ణాటక రాష్ట్రం బీదర్‌లో పట్టపగలే దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. శివాజీ చౌక్‌లోని ఓ ఏటీఎం కేంద్రంలో డబ్బులు పెట్టేందుకు వచ్చిన వాహనం సిబ్బందిపై కాల్పులు జరిపారు. బైకుపై వచ్చిన ఇద్దరు నిందితులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ సెక్యూరిటీ గార్డు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం నగదు పెట్టెతో దొంగలు పరారయ్యారు.