క్రెడిట్ కార్డుల వాడకం సాధారణం అయిపోయింది. చేతిలో డబ్బు లేని సమయంలో క్రెడిట్ కార్డ్ ఆపద్భాందవుడిలా మారుతోంది. అందుకే చాలా మంది క్రెడిట్ కార్డులను వాడుతున్నారు. అయితే ఒకప్పుడు క్రెడిట్ కార్డులు శాలరీ పొందే వ్యక్తులకు మాత్రమే ఇస్తారని భావించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంది. నేడు, విద్యార్థులు, గృహిణులు కూడా ఉద్యోగాలు లేదా ఆదాయ రుజువు లేకుండా క్రెడిట్ కార్డులను పొందుతున్నారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఇప్పుడు కస్టమర్ ప్రొఫైల్‌లను కొత్త దృక్పథంతో సమీక్షిస్తున్నాయి.…