దేశంలో ఒమిక్రాన్ అలజడి రేపుతోంది. ఈ నేపథ్యంలో థర్డ్ వేవ్ ను అపాలంటే బూస్టర్ డోస్ కచ్చితం అనటం హాస్యాస్పదం అన్నారు డాక్టర్ యు.రఘురాం. అత్యధిక బూస్టర్ డోస్ వేసుకున్న ఇజ్రాయెల్ లో ఫోర్త్ వేవ్ నడుస్తూ భారీ కేసులు నమోదవుతున్నాయన్నారు. టెక్నికల్ గా కోవిషీల్డ్ లో అప్డేటెడ్ బూస్టర్ రాదన్నారు. వేసుకున్నా ఆ బూస్టర్ డోస్ పని చేస్తుందని నమ్మకం లేదన్నారు. కోవాక్సిన్ లో సాధారణ ఫ్లూ వ్యాక్సిన్స్ లు, ఎప్పటికప్పుడు అప్డేటెడ్ బూస్టర్ తీసుకోవచ్చు…
కరోనా కట్టడి కోసం ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది.. మహమ్మారిపై విజయం సాధించడానికి భారత్‌లోనూ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది.. ఇప్పటికే 58,14,89,377 మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేశారు అధికారులు.. ఇందులో ఫస్ట్ డోస్ తీసుకున్నవారు.. ఫస్ట్ మరియు సెకండ్ డోస్ తీసుకున్నవారు సైతం ఉన్నారు. దేశవ్యాప్తంగా అందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేయాలంటే మరికొంత సమయం పడుతుంది.. అయితే, ఇప్పుడు, ఫస్ట్, సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ మాత్రమే కొనసాగుతోంది.. మరోవైపు బూస్టర్ డోస్ (మూడో డోసు)పై కూడా చర్చ…