ఈఏడాది కూడా స్వాతంత్ర్యదినోత్సవాన్ని గోల్కొండ కోటలోనే నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం.. ఈ నెల 15 వ తేది ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని తెలిపారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్… ఇవాళ బీఆర్కే భవన్‌లో సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించిన సీఎస్.. స్వాతంత్ర్యదినోత్సవం కోసం చేపట్టాల్సిన ఏర్పాట్లపై సమీక్షించారు.. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ…