తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలం నరసింగాపురంలో జరిగిన ఒక ఘటన సినిమా కథను తలపిస్తోంది. ఇటీవల రిలీజ్ అయి మంచి టాక్ తెచ్చుకున్న ‘కోర్టు’ సినిమాను పోలి ఉన్న ఈ ఘటన చర్చనీయాంశం అయింది. అసలు విషయం ఏమిటంటే మిట్టపాళెం ఎస్సీ కాలనీకి చెందిన అజయ్ అనే యువకుడిని ప్రేమించిన 17 ఏళ్ల మైనర్ బాలిక నిఖిత మరణం పలు అనుమానాలకు తావిచ్చింది. ఈ ఘటనలో పరువు హత్య జరిగిందా లేక ఆత్మహత్యా అనే కోణంలో పోలీసులు…