పుత్తూరు మున్సిపల్ ఛైర్మన్ పదవి అమ్ముకున్నారనే ఆరోపణలపై మంత్రి ఆర్కే రోజా స్పందించారు. పదేళ్ళుగా ఎక్కడైనా తప్పు చేశాను అనో.. ఒకరి దగ్గర ఒక్క రూపాయి తీసుకున్నానో నిరూపించగలరా అని ప్రశ్నించారు. కాగా.. జగన్ మీదా ఆయన సొంత చెల్లిలే విమర్శలు చేసినప్పుడు.. తనమీద ఎందుకు చేయరని పేర్కొన్నారు. కౌన్సిలర్ భువనేశ్వరికి పదవీ ఇస్తే అమ్ముడుపోయి.. తనపైనే విమర్శిస్తున్నారని మంత్రి తెలిపారు.
Puttur Municipal Councilor Bhuvaneshwari vs Minister Roja: తిరుపతిలోని పుత్తూరు మున్సిపల్ చైర్మన్ పదవి వివాదం రోజురోజుకు ముదురుతోంది. పుత్తూరు మున్సిపల్ చైర్మన్ హరి, 17వ వార్డు కౌన్సిలర్ భువనేశ్వరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో మంత్రి రోజాపై సంచలన ఆరోపణలు చేసిన కౌన్సిలర్ భువనేశ్వరి.. ఏకంగా సవాల్ విసిరారు. తన వద్ద డబ్బులు తీసుకోలేదని మంత్రి రోజా ఆమె పిల్లల మీద ప్రమాణం చేస్తారా? అంటూ సవాల్ విసిరారు. రోజా ప్రమాణం…