తెలంగాణలో పత్తి కొనుగోళ్ళను కొనసాగించాలని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ను కోరారు. ఈ వాన కాలంలో తెలంగాణ రాష్ట్రంలో మొత్తము 44.92 లక్షల ఎకరాలలో పత్తి సాగు చేశారని.. 25.02 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి రాగలదని అంచనా వేసినట్లు చెప్పారు. తదనుగుణంగా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో 285 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 8569.13 కోట్లు వెచ్చించి.. 12.31 లక్షల…