రష్యాకు చెందిన వ్యోమగామి ఒలేగ్ కొనోనెంకో అనే వ్యక్తి అంతరిక్షంలో 1000 రోజులు పూర్తి చేసిన ప్రపంచంలోనే మొదటి వ్యక్తిగా నిలిచారు. రష్యాలో వ్యోమగామిని కాస్మోనాట్ అంటారు. ఇంతకుముందు ఈ రికార్డు రష్యాకు చెందిన కాస్మోనాట్ గెన్నాడీ పడల్కా పేరిట ఉంది. అతను 878 రోజులు అంతరిక్షంలో ఉన్నారు.