ACB Calls: ఏసీబీ పేరుతో కొంతకాలంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్న సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఏసీబీ డీజీ అధికారికంగా స్పందించారు. ప్రభుత్వ ఉద్యోగులపై కేసులు నమోదు చేయకుండా ప్రైవేట్ వ్యక్తులు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆయన తెలిపారు. డబ్బులు చెల్లించకుంటే కేసు పెడతామని భయపెట్టే వారి మాటలను నమ్మొద్దని ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్చరిక చేశారు. ఏసీబీ పేరుతో ఎవరైనా బెదిరింపులకు పాల్పడిన వెంటనే సంబంధిత అధికారులకు…