Vijaya Sai Reddy: రాజ్యసభలో మంగళవారం నాడు కీలక చర్చ నడించింది. కార్పొరేట్ కంపెనీల ట్యాక్స్ ఎగవేతపై ఏం చర్యలు తీసుకున్నారని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రిని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ.. కొన్ని కార్పొరేట్ కంపెనీలు ప్రభుత్వానికి కస్టమ్స్ డ్యూటీ, ఇతర పన్నులు ఎగవేస్తున్నందున దీనిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలేంటో వివరించాలని ఆయన నిలదీశారు. కేంద్ర ప్రభుత్వ ఇన్వెస్టిగేషన్ సంస్థలైన డీఆర్ఐ (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్),…