కరోనా రక్కసి మరోసారి రెక్కలు చాస్తోంది. క్రమక్రమంగా కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావంతో కరోనా కేసులు అనుహ్యంగా పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ దాని ప్రభావాన్ని చూపుతోంది. దీంతో దేశవ్యాప్తంగా రికార్డుస్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూతో పాటు వీకెండ్ లాక్‌డౌన్ లాంటివి విధించి కరోనా కట్టడికి చర్యలు చేపట్టాయి. అయితే తెలంగాణలో సైతం కరోనా కోరలు చాస్తోంది. తాజాగా రాష్ట్రంలో కొత్తగా 2,983 కరోనా…