ఏపీలో గ్రూప్-1 పరీక్ష ప్రశాంతంగా ప్రారంభం కాగా.. ఓ వ్యక్తి కాపీయింగ్ చేస్తూ పట్టుబడ్డాడు. ఒంగోలు క్విస్ ఇంజినీరింగ్ కళాశాల పరీక్షా కేంద్రంలో కాపీ చేస్తూ ఓ అభ్యర్థి పట్టుబడ్డాడు. పరీక్షా కేంద్రంలో సెల్‌ఫోన్‌తో ప్రవేశించిన అభ్యర్థిని కాపీ చేస్తుండగా ఇన్విజిలేటర్ పట్టుకున్నారు.
ఆరోపించిన రిక్రూట్‌మెంట్ స్కామ్‌లు, పేపర్ లీక్ కేసులకు వ్యతిరేకంగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆదివారం పరీక్షలలో కాపీ చేసిన వారికి జీవిత ఖైదు లేదా 10 సంవత్సరాల జైలు శిక్ష విధించబడుతుందని అన్నారు.