కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరుడిని దర్శించుకోవడానికి నిత్యం వేలాది మంది తిరుమలకు తరలివస్తుంటారు.. ఇక, వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతి, తిరుమల కిక్కిరిసిపోనుంది.. అయితే, ఈ సమయంలో.. ఏపీఎస్‌ఆర్టీసీ, తిరుపతి విభాగం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది.. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని వైకుంఠ ద్వారం తెరిచి ఉంచే 10 రోజులపాటు దర్శన టికెట్లు కలిగి ఉన్న ప్రయాణికులను మాత్రమే కొండపైకి అనుమతించాలని ఆర్టీసీ నిర్ణయం తీసుకోవడం రచ్చగా మారుతోంది.. ఆర్టీసీ నిర్ణయంపై వెంకన్న భక్తులు మండిపడుతున్నారు..…