Sengol: కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభ సమయంలో ప్రధాని నరేంద్రమోడీ ‘సెంగోల్’ని ప్రతిష్టించారు. ఆ సమయంలో ఇది చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ సెంగోల్ మరోసారి వార్తల్లో నిలుస్తోంది. అఖిలేష్ యాదవ్ సమాజ్‌వాదీ(ఎస్పీ)కి చెందిన ఎంపీ ఆర్‌కే చౌదరి సెంగోల్ స్థానంలో రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.