మీరంతా సమర్థులని భావించి ఈ బాధ్యతలు అప్పగించడం జరిగిందని, పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టాలని వైసీపీ పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకులకు మాజీ సీఎం వైఎస్ జగన్ సూచించారు. జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయిలో ఉన్న బూత్ కమిటీల వరకూ ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. రీజినల్ కో-ఆర్డినేటర్లకు పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులు సహాయకారులుగా ఉంటారని.. రీజినల్ కో-ఆర్డినేటర్లతో అనుసంధానమై వారికి కాళ్లు, చేతులుగా పార్లమెంటు పరిశీలకులు పనిచేస్తారన్నారు. నియోజకవర్గాల్లో పార్టీ ఇన్‌ఛార్జిలు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండేలా…