Revanth Reddy: టీ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనని ఎలా వాడుకోవాలో అని అధిష్టానం ఆలోచిస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ఉన్న పాత వారికి, ఇతర పార్టీల నుంచి వచ్చిన కొత్త వారికి ఘర్షణ వాతావరణం ఉండడం సహజమన్నారు. పాత కొత్త అని బేదం ఉండకూడదని అధిష్టానమే చెబుతోందని గుర్తు చేశారు.
చుక్కాని లేని నావ… అన్న వాడకానికి కాంగ్రెస్ పార్టీ అచ్చమైన రూపంగా నిలుస్తోంది. ఆ పార్టీ జాతీయ నాయకత్వంలో కొరవడుతున్న రాజకీయ వ్యూహ చతురత.. రోజురోజుకూ కాంగ్రెస్ ను తీసికట్టుగా మార్చేస్తోంది. ఉత్తర భారతం సంగతి పక్కనబెడితే.. దక్షిణ భారతంలో అయితే.. మరీ దారుణంగా ఉంది. కనుమరుగు కానున్న జీవుల జాబితా మాదిరిగా.. అంతరించిపోనున్న భాషల మాదిరిగా.. ఆ పార్టీ వ్యవహారశైలి నడుస్తోంది. దక్షిణ భారత దేశంలో కర్ణాటకలో ఉన్న బలాన్ని.. బీజేపీ రాజకీయ చతురత ముందు…