ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ కె.రోశయ్య ఈ రోజు ఉదయం కన్నుమూశారు. ఈ నేపథ్యంలో రోశయ్య మృతి పట్ల రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు జానారెడ్డి, గీతారెడ్డిలు రోశయ్య కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ.. రోశయ్య మృతి చెందడం చాలా బాధకరమని, సుదీర్ఘ రాజకీయ అనుభవంలో.. ఎక్కడా మచ్చ తెచ్చుకోలేదు ఆయన అన్నారు. ఆర్థిక సమస్యలపై ఎంతో పట్టు…