తెలంగాణ వేదికగా హుజూరాబాద్ రాజకీయం రకరకాల మలుపులు తిరుగుతోంది. ఉప ఎన్నికకు కారణమైన మాజీ మంత్రి ఈటల రాజేందర్.. బీజేపీ అభ్యర్థిగా నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. పోటీగా.. అధికార టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్.. పోటాపోటీ వాడీవేడీ ప్రచారం చేస్తున్నారు. ఇదే సమయంలో.. కాంగ్రెస్ మాత్రం ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేక మల్లగుల్లాలు పడుతోంది. కొన్నాళ్లపాటు కొండా సురేఖ పేరు బలంగానే వినిపించింది. కానీ.. ఆమె సుముఖంగా ఉన్నారా లేదా.. అన్నది కూడా సరైన స్పష్టత రాకుండా…