Paris Olympics: పారిస్ ఒలింపిక్స్ సమయం దగ్గర పడుతోంది. జూలై నెలలో ఒలింపిక్స్ ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే.. 2024 పారిస్ గేమ్స్ కోసం తాము ‘ఇంటిమసీ బ్యాన్’(సాన్నిహిత్యంగా మెలగడం) ఎత్తేసింది. శనివారం ఒలింపిక్ విలేజ్ డైరెక్టర్ లారెంట్ మిచాడ్ మాట్లాడుతూ.. 2024 గేమ్స్ కోసం బ్యాన్‌ని ఎత్తేస్తున్నట్లు తెలిపారు. 14,250 మంది అథ్లెట్లకు 3 లక్షల కండోమ్స్ అందుబాటో ఉంచినట్లు వెల్లడించారు.