జీతాల సమస్యపై పాట్నా హైకోర్టు న్యాయమూర్తి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జనరల్ ప్రావిడెంట్ ఫండ్ ( జీపీఎఫ్) ఖాతా తెరిచి జీతం విడుదల చేయాలని సుప్రీంకోర్టును కోరారు.
ఏపీలో ఇసుక తవ్వకాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు టీడీపీ ఫిర్యాదులు చేసింది. ఇసుక తవ్వకాల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ సీబీఐ, సీవీసీలకు టీడీపీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు, కనకమేడల లేఖలు రాశారు. ఎంఎస్టీసీ వేదికగా ఇసుక అక్రమాలకు ఏపీ ప్రభుత్వం తెర లేపిందని టీడీపీ లేఖల్లో పేర్కొంది.