అదీ ఇదీ అని కాదు.. దేశంలో నిత్యావసర సరుకుల ధరలు అడ్డూ, అదుపూ లేకుండా పెరుగుతున్నాయి. పెట్రో ధరల సెగ వంటింట్లో మంట పుట్టిస్తున్నాయి. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు ప్రజలపై మరింత భారం మోపుతున్నాయి. మధ్యతరగతి కొనుగోలు శక్తి నానాటికీ దిగజారి పోతుంది. నలుగురు కుటుంబ సభ్యుల సగటు ఖర్చు ఎనిమిదేండ్లలో రెండింతలు దాటింది. వంట నూనెల దగ్గర్నుంచి సబ్బుల వరకూ మనం రోజువారీ ఉపయోగించే సరుకు ఏదైనా సరే వాటి ధర కొండెక్కి కూర్చున్నది.…