తెలుగునాట ‘రాముడు’ అనగానే గుర్తుకు వచ్చేది మహానటుడు నటరత్న యన్.టి.రామారావే! ఇక ‘రాముడు’ టైటిల్స్ లో రూపొందిన అనేక చిత్రాలలోనూ యన్టీఆర్ నటించి అలరించారు. అరవై ఏళ్ళ క్రితం రామారావు అభినయంతో అలరించిన ‘టైగర్ రాముడు’ ఆ కోవకు చెందినదే! జనబాహుళ్యంలో ఉన్న కథలకు సినిమా నగిషీలు చెక్కి చిత్రాలను రూపొందించడం రచయితలకు పరిపాటే! మొక్కై వంగనిది మానై వంగునా అనే సామెతను గుర్తు చేస్తూంది చిత్రం. అలాగే కన్నబిడ్డలను సన్మార్గంలో నడిపించవలసిన బాధ్యత తల్లిదండ్రులదే అన్న…