Pavala Shyamala: ఇండస్ట్రీ ఒక గ్లామర్ ప్రపంచం. ఇక్కడ విజయాలు ఉన్నంతవరకే గుర్తింపు వస్తుంది. ఒక్కసారి దాన్ని నుంచి బయటకు వస్తే పట్టించుకొనేవారు ఉండరు. ఇక సీనియర్ నటీనటుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలామంది సీనియర్ నటులు బతికి ఉండగానే చనిపోయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేసి డబ్బులు సంపాదిస్తున్నారు కొన్ని యూట్యూబ్ ఛానెల్స్.