మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఇవాళ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. మంత్రి కేటీఆర్ మానుకోటలో పోడు రైతులకు పట్టాలు పంపిణీతో పాటు పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని జిల్లాలోని 24,181మంది పోడు రైతులకు 67,730ఎకరాల పోడు పట్టాలను ఆయన అందించనున్నారు.