తీవ్రమైన శీతల వాతావరణం, కార్బన్ మోనాక్సైడ్ విషప్రయోగం కారణంగా గత రెండు వారాల్లో ఆఫ్ఘనిస్తాన్‌లో 100 మందికి పైగా మరణించారని ఆదివారం తాలిబాన్ నేతృత్వంలోని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
Dense fog delays 40 flights in Delhi: ఉత్తరాది రాష్ట్రాలను చలి వణికిస్తోంది. ఢిల్లీతో పాటు హర్యానా, ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. దీంతో పాటు పలు ప్రాంతాల్లో పొగమంచు కుమ్ముకుంది. ముఖ్యంగా ఢిల్లీ చలిగాలుల తీవ్రతతో తీవ్రంగా ప్రభావితం అవుతోంది. దీంతో పాటు దట్టమైన పొగమంచు ఢిల్లీ వ్యాప్తంగా ఏర్పడింది. దీంతో సమీపంలోని పరిసరాలు కనిపించని పరిస్థితి ఏర్పడింది.
ఉత్తర భారతదేశంలో కొనసాగుతున్న కోల్డ్‌వేవ్ పరిస్థితులు శుక్రవారం తీవ్రమయ్యాయి, ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల కంటే తక్కువగా ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఉదయం నైరుతి ఢిల్లీలోని ప్రాంతాలలో ఒకటైన ఆయా నగర్‌లో ఉష్ణోగ్రత 1.8 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా.. సఫ్దర్‌జంగ్‌లో ఉష్ణోగ్రత 4.0 డిగ్రీలుగా ఉంది.
Increased cold intensity in northern states: దేశంపై చలి పంజా విసురుతోంది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలు చలితో వణుకుతున్నాయి. ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాబోయే కొద్ది రోజులు చలిగాలుల పరిస్థితులు ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఢిల్లీతో పాటు పంజాబ్, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో వారం రోజులుగా చలిగాలుల ప్రభావం ఉంది. ఢిల్లీలో ఆదివారం ఉష్ణోగ్రత 5.3 డిగ్రీలకు పడిపోయింది. సాధారణం కన్నా మూడు డిగ్రీల తక్కువ…
రాష్ట్రంలో చలి విజృంభిస్తోంది. ఉత్తర, తూర్పు తెలంగాణ వైపు చలి గాలులు వీస్తున్నాయి. దీంతో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవడంతో పాటు చలి తీవ్రత పెరుగుతోంది. అడవులకు నిలయమైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.