Vaibhav Sooryavanshi: చెప్పట్లేదు కానీ చాలా ఒత్తిడి ఉంది.. వైభవ్ సూర్యవంశీ కీలక వ్యాఖ్యలు!
- మరోసారి వార్తల్లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ
- టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా వైభవ్
- ఇంతటి గుర్తింపు రావడం చాలా ఆనందంగా ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaibhav Sooryavanshi Admits Pressure After IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్లో తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించిన రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి వార్తల్లో నిలిచాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే దిగ్గజ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, హెన్రిచ్ క్లాసెన్‌లను వెనక్కి నెట్టి టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచిన వైభవ్.. సీజన్ ముగిసిన తర్వాత తన ఫిట్నెస్, ఒత్తిడి, నేర్చుకున్న పాఠాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ 2026 ఫైనల్ అనంతరం భారత మాజీ కోచ్ రవి శాస్త్రితో మాట్లాడిన వైభవ్ .. ఈ సీజన్ తర్వాత తనపై అంచనాలు భారీగా పెరిగాయని అంగీకరించాడు.
వరుసగా ఇంటర్వ్యూలు ఇవ్వడం వల్ల కూడా చాలా ఒత్తిడి అనిపిస్తోందని వైభవ్ సూర్యవంశీ చెప్పాడు. ‘ఇంతటి గుర్తింపు రావడం చాలా ఆనందంగా ఉంది. కానీ ఇప్పుడు నాపై ఒత్తిడి కూడా పెరిగింది. ఎక్కువ ఇంటర్వ్యూలు ఇస్తున్నాను. అయినప్పటికీ ఇది గర్వకారణం. వచ్చే సీజన్లో కూడా ఇదే స్థాయిలో రాణించేందుకు ప్రయత్నిస్తాను. నేను నా ఆటను నమ్ముతాను. కొట్టే బంతి వస్తే పూర్తిగా దాడి చేస్తాను. కానీ ఈ సీజన్లో నేర్చుకున్న ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ప్రతి మ్యాచ్‌లో ఒకే విధంగా ఆడలేం. మ్యాచ్ పరిస్థితులను అర్థం చేసుకుని, జట్టు అవసరాలకు అనుగుణంగా ఆటను మార్చుకోవాలి. ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో కూడా నేర్చుకున్నాను’ అని చెప్పాడు.
Also Read
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ఇటీవల కొందరు మాజీ క్రికెటర్లు వైభవ్ ఫిట్‌నెస్‌పై ప్రశ్నలు లేవనెత్తారు. దీర్ఘకాలం క్రికెట్లో కొనసాగాలంటే ఫిట్నెస్ కీలకమని సూచించారు. దీనిపై స్పందించిన యువ బ్యాటర్.. ఇప్పటికే తన శారీరక దారుఢ్యంపై ప్రత్యేకంగా పని చేస్తున్నానని వెల్లడించాడు. ‘అవును, నా ఫోకస్ ఇప్పుడు ఫిట్‌నెస్‌పైనే ఉంది. చాలా సంవత్సరాలు క్రికెట్ ఆడాలంటే గాయాలకు దూరంగా ఉండాలి. అందుకోసం ఫిట్‌నెస్‌పై మరింత కష్టపడాలి. సీనియర్ ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది అందరూ నాకు పూర్తి మద్దతు ఇస్తున్నారు. వారి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాను. రాజస్థాన్ జట్టులో అద్భుతమైన వాతావరణం ఉంది’ అని వైభవ్ పేర్కొన్నాడు.
ఐపీఎల్ 2026లో వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. సీజన్ మొత్తంలో తన వయసును మరిపించే ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్న బుడ్డోడు.. అనేక ప్రతిష్టాత్మక అవార్డులను గెలుచుకున్నాడు. ఆరెంజ్ క్యాప్ (అత్యధిక పరుగులు), మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్, ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్, సూపర్ స్ట్రైకర్ అవార్డు, సూపర్ సిక్సెస్ అవార్డుయూ అందుకున్నాడు. 15 ఏళ్ల వయసులోనే ఐపీఎల్‌ను శాసించిన వైభవ్.. భవిష్యత్ భారత క్రికెట్‌కు పెద్ద ఆశాకిరణంగా మారాడు.
తాజావార్తలు
-
Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
-
Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
-
OTR : కుప్పంలో పాత నేత మళ్ళి కీలక బాధ్యత లోకి రాబోతున్నారా?
-
Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!