విశాఖపట్నం పోర్టులో బొగ్గు నిల్వలు పేరుకుపోయాయి. ఏకంగా 1.4 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు పేరుకుపోయాయి. అంతర్జాతీయ మార్కెట్ నుంచి దిగుమతి చేసుకున్న కోల్ ధరతో పోలిస్తే.. తక్కువ ధరకు లభిస్తున్న దేశీయ బొగ్గు లభిస్తుండడంతో విదేశాల నుంచి బొగ్గును కొనుగోలు చేసేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. బొగ్గు ధరలలో వ్యత్యాసం కారణంగా కొనుగోళ్లు ఆగిపోయాయి.