Weather Update: తెలంగాణ రాష్ట్రం అంతటా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల అనేక జిల్లాల్లో రోడ్లు జలమయమై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాగులు, వంకలు పొంగిపొర్లుతూ ప్రజలకు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిశాయి. గౌరారంలో 23.5 సెం.మీ, ఇస్లాంపూర్‌లో 17.8 సెం.మీ వర్షపాతం నమోదైంది. కౌడిపల్లి, చిన్నశంకరంపేట, దామరంచ, మాసాయిపేటల్లో కూడా 15–17 సెం.మీ వరకు వర్షాలు కురిశాయి. సిద్ధిపేట…