సింగరేణిలో సమ్మె సైరన్ మోగడంతో.. కార్మిక సంఘాలు ఒక్కటయ్యాయి. ఒక్కరోజు సమ్మె కాస్తా.. మూడు రోజులకు పెరిగింది. అయితే ఈ సమ్మె ఎవరి కోసం? సమ్మె వెనక ఇంకేదైనా బలమైన ఆలోచనలు ఉన్నాయా? బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నట్టు చెబుతున్నా.. కార్మిక వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సింగరేణిలో 3 రోజుల సమ్మె..! తెలంగాణలో నల్లబంగారు గనులు రాష్ట్రానికి సిరులు కురిపిస్తున్నాయి. రాష్ట్రంలో పదకొండు ఏరియాల్లో విస్తరించిన గనుల్లో 45…